Social 1080×1350 • Multi-page
26-09-2024 BREAKING NEWS 10:39 AM
swarnodayam.com
Telugu Daily News

ఫైర్ పోలీసుల సాహసం..! బావిలో దూకిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది.

ఫైర్ పోలీసుల సాహసం..! బావిలో దూకిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

మతిస్థిమితం లేని ఓ మహిళ బావిలో పడగా క్షణాల్లో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సదరు మహిళలు సురక్షితంగా బావిలో నుంచి బయటకు తీసిన ఫైర్ పోలీసుల సాహసాన్ని పలువురు శభాష్ అంటున్నారు. వివరాల్లోకి వెళితే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల శారధ వయస్సు 45 సంవత్సరాలు మతి స్థిమితం లేక గ్రామంలోని పేద బావిలో దూకింది. స్థానిక ప్రజలు వెంటనే హుజురాబాద్ లోని ఫైర్ స్టేషన్ కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది బయలుదేరి గ్రామానికి చేరుకొని ఆ మహిళ పడిన బావిలో దిగి సురక్షితంగా బయటకు తీసి శారద ప్రాణాలను కాపాడారు. బావిలో పడిన మహిళను ఎంతో చాకచక్యంగా ప్రాణాలతో బయటకు తీసి కాపాడిన హుజురాబాద్ ఫైర్ సిబ్బంది ALF M. శ్రీనివాస్, DOP ప్రభాకర్, firemens: సందీప్, అనిల్ కుమార్, శివారెడ్డిలను గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!