27-09-2024 NORMAL NEWS 07:18 AM
swarnodayam.com
Telugu Daily News
27-09-2024 07:18 AM By Mandala Yadagiri

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కాల్వ సునీల్ రెడ్డి

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కాల్వ సునీల్ రెడ్డి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన నూతన కార్యవర్గ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షునిగా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన కాల్వ సునీల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కార్యద్శిగా కొన్ని సంవత్సరాలుగా ఆయన పని చేశారు. ప్రస్తుతానికి వరంగల్ బుల్లికుంట వాగ్దేవి కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పి డి)గా పనిచేస్తున్నారు. ఈయన అనేక జాతీయస్థాయి క్రీడ పోటీల్లో పాల్గొన్నారు. సీనియర్ జాతీయ స్థాయిలో తెలంగాణ అసోసియేషన్ తరుపున పాల్గొన్నారు. అంతేకాకుండా అండర్ 14, U17, U19 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు కెప్టెన్ గా మరియు కాకతీయ యూనివర్సిటీ టీం కు కూడా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించారు. జూనియర్స్ జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు. ఈయన ఎన్నికకు సహకరించిన సీనియర్ క్రీడాకారులు సంపత్ రావు, గండ్ర సమ్మిరెడ్డి, ఏం రవీందర్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్ళ దామోదర్, నీరటి రమేష్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సునీల్ ఎన్నిక పట్ల ఆయనకు మిత్రులు, అభిమానులు, సీనియర్ క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!