27-09-2024 NORMAL NEWS 07:48 AM
swarnodayam.com
Telugu Daily News
27-09-2024 07:48 AM By Mandala Yadagiri

మృతుడి కుటుంబానికి ఎస్బిఐ లైఫ్ చేయూత

మృతుడి కుటుంబానికి ఎస్బిఐ లైఫ్ చేయూత
IMG-20240927-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎస్బిఐ లైఫ్ లో పాలసీ తీసుకొని దురదృష్టవశాత్తు మృతి చెందిన ఏడు మేకల రవికుమార్ కుటుంబానికి బీమా సొమ్ము 6.50 లక్షల రూపాయల చెక్కు ను అందించి ఎస్బిఐ లైఫ్ ఆ కుటుంబానికి చేయూతగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… ఎలిగేడు మండలం శివపల్లి గ్రామానికి చెందిన రవికుమార్ 2022లో హుజురాబాద్ ఎస్బిఐ లైఫ్ లో స్మార్ట్ స్కాలర్ పాలసీ తీసుకున్నాడు. కాగా గత మార్చిలో రవికుమార్ అనారోగ్యంకు గురై మృతి చెందాడు. దీంతో మృతుని భార్య కవితకు హుజురాబాద్ ఎస్బిఐ లైఫ్ డివిజనల్ మేనేజర్ గంగిశెట్టి సుధాకర్, డిప్యూటీ మేనేజర్ శ్రీరామోజీ నాగేశ్వర్ లు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మృతుడు రవికుమార్ తన కూతురు ధృతి పేరుతో పాలసీ తీసుకున్నాడని, పాలసీదారుడు మృతి చెందడం వల్ల భీమా డబ్బులు 6.50 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆయన కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులను 23 సంవత్సరాలు ఎస్బిఐ లైఫ్ చెల్లిస్తుందని అమ్మాయికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 75 లక్షల రూపాయలు ఎస్బిఐ లైఫ్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యు యం నగేష్, లైఫ్ మిత్ర అల్లమల్ల రాజు, కొత్తగట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!