27-09-2024 NORMAL NEWS 08:20 AM
swarnodayam.com
Telugu Daily News
27-09-2024 08:20 AM By Mandala Yadagiri

చేనేత కార్మికుల కూలీ రేట్లు పెంచాలి -చేనేత సంఘం 82వ మహాసభ

చేనేత కార్మికుల కూలీ రేట్లు పెంచాలి -చేనేత సంఘం 82వ మహాసభ
IMG_20240927_191629

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: చేనేత సంఘాలలో పనిచేసే చేనేత కార్మికుల కూలీరేట్లను పెంచాలని, హెల్త్ కార్డులు ఎక్స్గ్రెషియా, క్లైములు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం 82వ మహాసభలో పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని చేనేత సంఘం ఆవరణలో మహాసభ జరిగింది. ఈ మహాసభలో టిఎస్ సిఓ డిఎన్ఓ వి జనార్ధన్, డివో సంతోష్ కుమా,ర్ అజార్, వహాబ్, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ రాజయ్య, చేనేత సంఘ అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్, ఉపాధ్యక్షులు వేముల యాదగిరి, గుండేటి మహాదేవ్, మంచికట్ల వెంకటయ్య, మండల సత్యనారాయణ, కుడికాల ప్రభాకర్,మంచికట్ల సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం వస్త్ర నిలువలు ఖరీదు చేయకపోవడం వల్ల ఇబ్బంది జరిగేదని కానీ ఇటీవల వాటిని ఖరీదు చేయడం వల్ల ప్రయోజనం సంఘం పొందిందని అన్నారు. ప్రతి ఏడాది సంఘం కె.ఎల్.బి అవార్డుకై ప్రయత్నిస్తుందని అన్నారు. సభ్యులందరికీ సహకారంతో సంఘ అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సహాయ సంచాలకులు విద్యాసాగర్ మాట్లాడుతూ సభ్యుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ముందుండి జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపలాని కృషి చేస్తామని అన్నారు. కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సంఘ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!