Social 1080×1350 • Multi-page
28-09-2024 BREAKING NEWS 07:05 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలరించిన ఫ్రెషర్స్ డే సంబరాలు.

హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలరించిన ఫ్రెషర్స్ డే సంబరాలు.
IMG_20240928_175753

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజురాబాద్ లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వి అంజనేయరావు అధ్యక్షతన స్థానిక ఏసిపి శ్రీనివాస్ జీ, సిఐ తిరుమల్ గౌడ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకనుద్దేశించి ఏసిపి శ్రీనివాస్ జీ, సిఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మీరు అసంఘటిత కార్యకలాపాలకు దూరంగా ఉంటూ,
ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, పోలీస్ కేసులు లేకుండా చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని చెప్పారు. ఇదే క్రమంలో ఆంటీ డ్రగ్స్, ఆంటీ రాగింగ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న మీరు మాదక ద్రవ్యాల బారిన పడకుండా, కళాశాలకు క్రమం తప్పకుండా వచ్చి మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని చెప్పారు. విద్యార్థుల మధ్య మంచి స్నేహాభావం ఏర్పడి, ఒకరికొకరు పరిచయం చేసుకుని, కలిసికట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు, అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యముగా తెలంగాణ ఉద్యమంలో ఉర్రుతలు ఊగించిన చూడ చక్కని తల్లి … పాటకు నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!