Social 1080×1350 • Multi-page
28-09-2024 BREAKING NEWS 09:44 AM
swarnodayam.com
Telugu Daily News

విద్యార్థులకు కుక్కల, కోతుల కాటుపై అవగాహన సదస్సు

విద్యార్థులకు కుక్కల, కోతుల కాటుపై అవగాహన సదస్సు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శనివారం విద్యార్థిని విద్యార్థులకు కోతుల, కుక్కల కాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పశు వైద్యాధికారులు కుక్కలు, కోతుల నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కరిచినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, మందులు ఎలా వాడాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అన్న అంశాలపై విద్యార్థులకు కులంకషంగ వివరించారు. కుక్కల, కోతుల ఆలోచన విధానం పిల్లలకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ జె రవికుమార్, పశు వైద్యాధికారులు డాక్టర్ పి రవీందర్ రెడ్డి, డాక్టర్ ఏ రాజయ్య, అటవీ శాఖ అధికారి ని సౌమ్య, హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎకో క్లబ్బు సభ్యులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!