29-09-2024 NORMAL NEWS 02:46 AM
swarnodayam.com
Telugu Daily News
29-09-2024 02:46 AM By Mandala Yadagiri

గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలి.. -సిడిపిఓ సుగుణ

గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలి.. -సిడిపిఓ సుగుణ
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్ : గర్భిణీ స్త్రీలు పోషకాహారంను తీసుకోవాలని దానివల్ల వారికి ఎంతో మేలు జరుగుతుందని ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ- సూపర్వైజర్ల ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ జి సుగుణ మాట్లాడుతూ… పోషణ అభియాన్ కార్యక్రమం కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్ రాజశ్రీ మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలు సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు సరైన పోషకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజశ్రీ, అంగన్వాడీ టీచర్స్ రజిత, పద్మ, స్వరూప, మాజీ ఎంపిటిసి, వార్డు సభ్యులు, తల్లులు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!