29-09-2024 NORMAL NEWS 10:23 AM
swarnodayam.com
Telugu Daily News
29-09-2024 10:23 AM By Mandala Yadagiri

నరేందర్ రెడ్డి వైపు పట్టభద్రుల చూపు-పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.వి నరేందర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన..

నరేందర్ రెడ్డి వైపు పట్టభద్రుల చూపు-పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.వి నరేందర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన..
IMG_20240929_211704

ప్రచారంలో దూసుకెళ్తున్న అల్ఫోర్స్ అధినేత

అడుగడుగునా మద్దతు ప్రకటించిన సిద్ధిపేట పట్టబద్రులు , ఉపాధ్యాయులు మరియు యువకులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: త్వరలో రానున్న కరీంనగర్, ఆదిలాబాద్ ,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రముఖ విద్యాసంస్థలయిన ఆల్ఫోర్స్ అధినేత, అభ్యర్థి డా.వి నరేందర్ రెడ్డి అందరికన్నా ముందు ప్రకటించడమే గాక విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అన్ని వర్గాల నుండి విశేష స్పందన లభిస్తుంది. పట్టభద్రుల ఓటర్ నమోదుపై పలు సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కోమటి చెరువు వాకర్స్ అసోసియేషన్, డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్, బ్యాట్మెంటన్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నరేందర్ రెడ్డి కోరారు. ఇప్పటికే నాలుగు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఉన్న పట్టభద్రులను నిరుద్యోగులను ఉపాధ్యాయులను కలిసి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలంటూ విస్తృతంగా పర్యటించారు…అన్ని వర్గాల నుండి సానుకూలంగా స్పందన వస్తుంది. ఇప్పటికే ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు. తన అనుచరులు టీములుగా విడిపోయి నాలుగు ఉమ్మడి జిల్లాలను చుట్టేసి ఓటరు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

  • నరేందర్ రెడ్డి వైపు పట్టభద్రుల చూపు

ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పదవి మార్చి 29తో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఉన్నప్పటికీ పట్టభద్రుల సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారంలో డాక్టర్ నరేందర్ రెడ్డి దూసుకు పోతున్నారు. తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ సంస్థలను స్థాపించి, క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తూ లక్షలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్ధి, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను దక్కించుకున్నారు ఆయన. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న డాక్టర్ వి నరేందర్ రెడ్డి పట్ల పట్టభద్రులు ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మోగ్గు చూపుతున్నారు.

  • నిరుద్యోగులకు అండగా ఉండేందుకే రాజకీయాల్లోకి

డబ్బులు, ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదని రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలువడానికి సేవకుడుగా పని చేసేందుకు రాజకీయంలోకి వస్తున్నట్టు నరేందర్ రెడ్డి తెలిపారు. గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్టత సేవలు అందించారు. ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే డబ్బులను పట్టభద్రుల అభివృద్ధికి నిరుద్యోగ యువత కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికి తోడ్పడుతానని ఇప్పటికే ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 06 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2021 కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అర్హులు అని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!