Social 1080×1350 • Multi-page
30-09-2024 BREAKING NEWS 06:10 AM
swarnodayam.com
Telugu Daily News

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు..బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు
IMG_20240930_170210

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, సెప్టెంబరు 30: హుజురాబాద్ మండలం సింగాపురంలోని విఎస్సార్ డిగ్రీ కళాశాలలో సోమవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యార్థినిలు, అధ్యాపకులు బతుకమ్మలతో ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగరపు రజిత మాట్లాడుతూ.. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయని అన్నారు. ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ అని, ప్రేమానురాగాలకు ప్రతీక అని, ఆడబిడ్డలో బతుకు పండగ బతుకమ్మ అని అభివర్ణించారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగరపు రజితతో పాటు తాళ్ల పెళ్లి అజయ్, పోతిరెడ్డి హరీష్, గట్టు కోమల, గణేష్, శారధ, సతీష్, సదయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!