Social 1080×1350 • Multi-page
30-09-2024 BREAKING NEWS 06:40 AM
swarnodayam.com
Telugu Daily News

విద్యార్థులుఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోండి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోండి.ప్రిన్సిపల్ – లచ్చయ్య.

విద్యార్థులుఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోండి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోండి.ప్రిన్సిపల్ – లచ్చయ్య.
IMG-20240930-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ పాఠశాలలో ఆదివారం గ్లోబల్ శోటా కాన్ కరాటే డో ఇండియా
కరీంనగర్ జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి జలీల్ ఆధ్వర్యంలో కరాటే విన్యాసాలు, టెస్టులు నిర్వహించడం జరిగింది. కరాటే గ్రేడింగ్ బెల్ట్ టెస్ట్ లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గ్లోబల్ శోటో కాన్ కరాటే డో ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు హన్సి పొన్నం వెంకటేశం పర్యవేక్షణలో టెస్టులకు సంబంధించిన విన్యాసాలు జరగగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎల్లో, అరేంజ్, గ్రీన్, బ్లూ బెల్టులను, సర్టిఫికెట్లను
అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరాటే మాస్టర్ జలీల్ గత కొంతకాలంగా ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థిని, విద్యార్థులకు పెంపొందించడానికి, చదువుతోపాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ పోటీలలో విద్యార్థులుగా తయారు చేస్తున్న మాస్టర్ ని అభినందించారు. విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దశలో పయనించాలని స్మార్ట్ ఫోన్ అనే మహమ్మారి కి అలవాటు అయి సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నిరుపేదలైనటువంటి తల్లిదండ్రుల కలలను సాకారం అయ్యే విధంగా సత్ప్రవర్తనలో కూడిన చదువును చదివి పేదరికాన్ని నిర్మూలించాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చేసిన అద్భుతమైన విన్యాసాలకు అతిథులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థినీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం గ్రాండ్ కరాటే మాస్టర్ వెంకటేశం, మాస్టర్ ఎండి జలీల్ ను పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ శోటా కాన్ కరాటే డో ఇండియా అసోసియేషన్ కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, టౌన్ ఎస్సై మహమ్మద్ యూనిస్ అలీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ప్రిన్సిపల్ లచ్చయ్య, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ముప్పై వ వార్డు కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, మైనార్టీ నాయకులు మహమ్మద్ సలీం,
ఏఎంసి మాజీ డైరెక్టర్ ఖాలిద్. హుస్సేన్, ఎం.గోపాల్ రావు,
వెంగళరావు న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ బి రాజ్ కుమార్, పాత్రికేయుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!