30-09-2024 NORMAL NEWS 09:38 AM
swarnodayam.com
Telugu Daily News
30-09-2024 09:38 AM By Mandala Yadagiri

హుజురాబాద్ లో ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలు

హుజురాబాద్ లో ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో నాలుగు ఆస్పత్రులను హుజురాబాద్ డిప్యూటీ డిఎo హెచ్ ఓ డాక్టర్ చందు సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్న డాక్టర్ల వివరాలు, వారి యొక్క సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లా వైద్య శాఖ అనుమతి లేకుండా ఎవరు ఆసుపత్రులు నిర్వహించడానికి వీలులేదని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అధికారులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!