01-10-2024 NORMAL NEWS 06:33 AM
swarnodayam.com
Telugu Daily News
01-10-2024 06:33 AM By Mandala Yadagiri

హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సన్మానం

హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సన్మానం
IMG_20241001_173720

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
155వ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ భారత్ కార్యక్రమాలను పురస్కరించుకొని హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ మరియు సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను తపాల కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాంధీజీ పటానికి పూల మాలతో నివాళులు అర్పించి గాంధీజీ కలలు కన్న పరిశుభ్ర భారతావనిని నిర్మించడంలో పారిశుధ్య కార్మికులు ముందు ఉన్నారని, అదే లక్ష్యంతో దేశ పౌరులందరు భాగస్వాములు కావాలని పోస్ట్ మాస్టర్ యు మహేందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సన్మానం పొందిన పారిశుధ్య కార్మికురాలు రాచపెల్లి కాంతమ్మ, రాచపాల్లి లూల, మాటూరి పద్మ మరియు పోస్టల్ సిబ్బంది S.రాజు, K సందీప్, B తిరుపతి నాయక్, S హరీష్, స్వామి, సతీష్, రాజేష్, శివాజీ, రాము అపూర్వ, శివం, గోరవ్, అనిల్, నూక సదానందం పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!