Social 1080×1350 • Multi-page
01-10-2024 BREAKING NEWS 07:02 AM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వెలిచాల రాజేందర్ రావు పరామర్శ

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వెలిచాల రాజేందర్ రావు పరామర్శ
IMG-20241001-WA0089

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులతో రాజేందర్ రావు మాట్లాడారు. పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!