01-10-2024 NORMAL NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News
01-10-2024 07:57 AM By Mandala Yadagiri

శభాష్ సంతోష్..! -మూడు ఉద్యోగాలు ఆయన సొంతం.

శభాష్ సంతోష్..! -మూడు ఉద్యోగాలు ఆయన సొంతం.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఒక వ్యక్తి ఒక ఉద్యోగం సాధించడమే గగనం అవుతున్న నేటి తరుణంలో ఒక వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించడం పలువురిని ఔరా అనిపిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారానికి చెందిన కొండపర్తి సంతోష్ ఇటీవల విడుదల చేసిన DSC 2024 ఫలితాలలో 78.53 మార్కులతో లాంగ్వేజ్ పండిట్ తెలుగులో కరీంనగర్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, 74.53 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కరీంనగర్ జిల్లా 5వ ర్యాంకు సాధించాడు. గతంలో గురుకుల టిజిటి ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం సైదాపూర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఒకే ఏడాదిలో మూడు ఉద్యోగాలు సాధించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!