Social 1080×1350 • Multi-page
01-10-2024 BREAKING NEWS 08:47 AM
swarnodayam.com
Telugu Daily News

అలరించిన విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

అలరించిన విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
IMG_20241001_194343

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్వాగతం చెప్తూ ఫ్రెషర్స్ డే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డా”కందుకూరి శంకర్ మాట్లాడుతూ సీనియర్స్ నుండి సూచనలు సలహాలు తీసుకుని, గవర్నమెంట్ జాబ్స్ మీద దృష్టి సారించాలి, మీ భవిష్యత్తు కు డిగ్రీ టర్నింగ్ పాయింట్,మంచి మార్కులు సాధించాలి,కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో డిగ్రీ కళాశాల ఉంటడం వలన లైబ్రరీని ఉపయోగించుకోవాలనీ, విద్యార్థులు ఉద్యోగల మీద దృష్టి సారించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారపు రజిత, అధ్యాపకులు తాళ్లపెళ్లి అజయ్, పోతిరెడ్డి హరీష్, చల్లురి సతీష్ ,గొబ్బెట తిరుపతి, గాజుల శారదా, గట్టు కోమల, మహేష్, సదయ్య, బాస్కర్, రచన, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!