Social 1080×1350 • Multi-page
01-10-2024 BREAKING NEWS 09:11 AM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు.. ఫ్రెషర్స్ డే వేడుకలు

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు.. ఫ్రెషర్స్ డే వేడుకలు
IMG_20241001_201012

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మంగళవారం బంగారు పూల బతుకమ్మ సంబరాలు మరియు నూతన విద్యార్థులకు స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటంతో నృత్యం చేస్తూ పలువురిని ఆకట్టుకున్నాయి. బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, విద్యార్థులకు సామాజిక అంశాలతో పాటు సాంప్రదాయక పండగలు ఎంతో అవసరమని కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి వివరించారు. నూతనంగా విద్యను అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు చదువులో ఉండే మాధుర్యాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదలతో చదవగలిగితే ఉన్నత శిఖరాలను అవరోధించవచ్చని, మీరు అనుకున్న బాటలో నడిచే విధంగా మేము అధ్యాపకులుగా మార్గదర్శకులుగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ తన పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భద్రయ్య, తిరుపతి, కొలిపాక రమేష్, వెంకటేష్, అనిల్, వేణు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!