Social 1080×1350 • Multi-page
01-10-2024 BREAKING NEWS 09:23 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు – మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు – మంత్రి పొన్నం ప్రభాకర్
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

తెలంగాణ ఆడ బిడ్డలకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుండి 9 రోజుల పాటు జరుపుకునే పూల పండగ, బతుకునిచ్చే బతుకమ్మ పండగను
ఆడబిడ్డలు పూలను పూజిస్తూ , ప్రకృతిని ఆరాధిస్తూ అత్యంత వైభవంగా జరుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్క రోజు మినహా మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా బతుకమ్మలను అమర్చుకుంటారు.
తెలంగాణ పల్లె పల్లెలో ఆట పాటలతో సంస్కృతీ సంప్రదాయాల తో బతుకమ్మ పండగ జరుపుకోవాలని కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన లో మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం,500 కి గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పనిచేస్తూ, మహిళా కేంద్రంగా కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వనుందనీ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పండుగను అత్యంత సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!