Social 1080×1350 • Multi-page
03-10-2024 BREAKING NEWS 04:45 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకునాయకులంతా కలిసికట్టుగాకృషి చేయాలి..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకునాయకులంతా కలిసికట్టుగాకృషి చేయాలి..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హుజురాబాద్): కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగా నేటి నుంచి సిద్ధం కావాలని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ లోని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెలిచాల రాజేందర్ రావు వెళ్లారు. సందర్భంగా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులు గెలుపెందేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. వెలిచాల రాజేందర్ రావును కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో టిపిసిసి కార్యదర్శి వైద్యుల అజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, కర్ర రాజశేఖర్, మల్లికార్జున రాజేందర్, పొన్నం సత్యం, కార్పొరేటర్ ఆర్ష కిరణ్ మల్లేషం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, చక్రధర్ రావు, పొన్నం శ్రీనివాస్, రమణ, దేవేందర్ పటేల్, 11వ డివిజన్ ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు పిట్టల లింగయ్య, కరీంనగర్ పట్టణ ముదిరాజ్ సంఘం కొలకాని నర్సయ్య, కన్నం అంజికుమార్, కొమ్మ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!