Social 1080×1350 • Multi-page
03-10-2024 BREAKING NEWS 06:08 AM
swarnodayam.com
Telugu Daily News

న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ హుజురాబాద్ బార్ అసోసియేషన్ నిరసన

న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ హుజురాబాద్ బార్ అసోసియేషన్ నిరసన
IMG_20241003_170607

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న కలీం పై సెప్టెంబర్ 28న మాదన్నపేట పోలీసుల దాడిని ఖండిస్తూ హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సెక్రెటరీ మట్టేల తిరుపతి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను, న్యాయవాదులను కించపరుస్తూ పోలీసులు మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కలీంపై పరుష పదజాలంతో మాట్లాడి దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే న్యాయవాదుల రక్షణ కోసం చట్టం కూడా వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పులుగు లింగారెడ్డి, భూమిరెడ్డి, వై అరుణ్ కుమార్, జీ నరసింహస్వామి, శ్రీనివాస్, ఏ లింగమూర్తి, సిహెచ్ భాను కిరణ్, ఏం రాజేందర్, మురళి, మౌనిక, సౌమిత్ర, హరిహరన్, కళ్యాణ్, కుమార్, ఆస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!