Social 1080×1350 • Multi-page
03-10-2024 BREAKING NEWS 09:01 AM
swarnodayam.com
Telugu Daily News

బాధిత కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు పరామర్శ

బాధిత కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు పరామర్శ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు, మాజీ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ తల్లి లింగంపల్లి మల్లమ్మ ఇటీవల మృతి చెందింది. దీంతో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు లింగంపల్లి బాబు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మల్లమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. మల్లమ్మ చిత్రపటానికి రాజేందర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, బాబు కుటుంబ సభ్యులకు మానోస్థైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరిళ్ల రతన్ రాజు, తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!