Social 1080×1350 • Multi-page
03-10-2024 BREAKING NEWS 09:15 AM
swarnodayam.com
Telugu Daily News

పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం..!!

పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం..!!
IMG-20241003-WA0149

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డులు ఉండగా వాటిల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీ ఓటర్లలో 82,04,518 మంది పురుషులు ఉండగా మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతరులు 493 మంది ఓటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!