Social 1080×1350 • Multi-page
03-10-2024 BREAKING NEWS 09:44 AM
swarnodayam.com
Telugu Daily News

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.. – మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్.. హుజురాబాద్ శ్రీ పాటిమీది ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతిదేవి దేవాలయము,రంగనాయకుల గుట్ట వద్ద మొదటి సంవత్సరం ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం.

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.. – మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్.. హుజురాబాద్ శ్రీ పాటిమీది ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతిదేవి దేవాలయము,రంగనాయకుల గుట్ట వద్ద మొదటి సంవత్సరం ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం.
IMG_20241003_204211

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ కేంద్రంలో గల పాటిమీద స్వయంభు వెలసిన శ్రీ ఆంజనేయ సహిత సరస్వతి దేవి ఆలయంలో..శరన్నవరాత్రి ఉత్సవాలు, మొదటిసారిగా ఈ సంవత్సరం నుంచే ప్రారంభం కావడం సంతోషకరంగా ఉందని ఆలయ అర్చకులు తీరుణహరి తిరుమలేష్ పేర్కొన్నారు. మొదటి సంవత్సరం మొదటి రోజు గురువారం హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, ఐదవ వార్డ్ కౌన్సిలర్ అపరాజ ముత్యం రాజు.. హుజురాబాద్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారి నిత్యా అలంకరణ.. వివరాలు వివరించారు..
__తేది. 03-10-2024 గురువారం రోజున బాల త్రిపుర సుందరీ అలంకరణ
తేది. 04-10-2024 శుక్రవారం రోజున అన్నపూర్ణ దేవి అలంకరణ..

తేది. 05-10-2024 శనివారం రోజున గాయత్రి మాత అలంకరణ ఉ॥ 8 గం॥లకు చండీహోమం, మం॥ 12గం॥లకు అన్న ప్రసాద వితరణ. తేది. 06-10-2024 ఆదివారం రోజున మాహాలక్ష్మి దేవి అలంకరణ తేది. .07-10-2024 సోమవారం రోజున లతిత త్రిపుర సుందరీ దేవి అలంకరణ.. తేది.08-10-2024 మంగళవారం రోజున భవాని మాత అలంకరణ
తేది.09-10-2024 బుధవారం రోజున సరస్వతీ దేవి అలంకరణ..తేది.10-10-2024 గురువారం రోజున దుర్గాదేవి అలంకరణ11-10-2024 శుక్రవారం రోజున మహిషాసుర మర్థిని అలంకరణ
..తేది. 12-10-2024 శనివారం రోజున అపరాజిత దేవి అలంకరణ, ఉ॥ 10 గం॥ లకు శమీ పూజ (విజయ దశమి)
_ప్రతి రోజు ఉ॥ 5 గం॥లకు అభిషేకం, 7 గం॥లకు ఉదయం పూజ, సా॥ 5గం॥లకు సాయంకాల పూజ జరుగును. కావున భక్తు జనులెల్లరు అమ్మవారి దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటి మరియు అర్చకులు ఆహ్వానించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!