04-10-2024 NORMAL NEWS 07:55 AM
swarnodayam.com
Telugu Daily News
04-10-2024 07:55 AM By Mandala Yadagiri

కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
IMG_20241004_185618

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శుక్రవారం హుజురాబాద్ కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఇంచార్జీ సీనియర్ సివిల్ జడ్జీ కె. వెంకటేష్, మున్సిఫ్ మేజిస్ట్రేట్ జి.స్వాతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా న్యాయవాదులు, కోర్టు మహిళా ఉద్యోగులు రంగురంగు పూలతో బతుకమ్మలను అలంకరించారు. న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానం చేశారు. మొదటి బహుమతి జూనియర్ సివిల్ జడ్జీ కోర్టుకు, రెండవ బహుమతి రెండవ అదనపు మేజిస్రేట్ కోర్టు, మూడవ బహుమతి మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టు, కన్సోలేషన్ బహుమతులు బార్ అసోసియేషన్ , సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులు దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మట్టేల తిరుపతి, బండి రమేష్, ఎజిపి గుర్రం శ్రీనివాస్, ముక్కెర రాజు, నల్ల భూమిరెడ్డి, బండి కళాధర్, లక్ష్మణమూర్తి, శ్రీధర్ బాబు, ముస్తఫా, సాంబమూర్తి, యం సదయ్య, నూతల శ్రీనివాస్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!