04-10-2024 NORMAL NEWS 09:52 AM
swarnodayam.com
Telugu Daily News
04-10-2024 09:52 AM By Mandala Yadagiri

నాలుగు కొలువులు సాధించి, యువతకు ఆదర్శంగా నిలిచిన అంబాల యువకుడు

నాలుగు కొలువులు సాధించి, యువతకు ఆదర్శంగా నిలిచిన అంబాల యువకుడు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన మెట్టుపల్లి రవీందర్ భద్రాచలం మైనారిటీ గురుకుల కళాశాల బాలురు -1 లో సివిక్స్ లెక్చరర్ గా పనిచేస్తునే గత గురుకుల ఫలితాలలో TGT, PGT, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. పస్తుతం TSPSC విడుదల చేసిన DSC ఫలితాలలో రవిందర్ సాంఘిక శాస్త్ర విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు.ఒకే సారి నాలుగు ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరంతర శ్రమనే తన విజయానికి కారణం అని రవీందర్ తెలిపారు.తన విజయానికి కారణమైన కుటుంబ సభ్యులకు మిత్రులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేసాడు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!