Social 1080×1350 • Multi-page
05-10-2024 BREAKING NEWS 05:22 AM
swarnodayam.com
Telugu Daily News

ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త -అధికారులను విచారణకు ఆదేశించిన లోకాయుక్త రిజిస్ట్రార్

ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త -అధికారులను విచారణకు ఆదేశించిన లోకాయుక్త రిజిస్ట్రార్
IMG_20241005_162109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ పట్టణం మరియు మండలంలోని పలు అక్రమ కట్టడాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు యువజన కాంగ్రెస్ నాయకుడు టేకుల శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణ శివారులో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్ఛగా తమ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా నోటీసుల పేరిట కాలయాపన చేశారని అన్నారు. ఇట్టి విషయమై ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేయగా స్పందన కరువైందని అందుకే న్యాయపోరాటం చేయడానికి సిద్ధమై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త అధికారులు నవంబర్ 8 తారీఖున ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్తకు రిజిస్ట్రార్ కి టేకుల శ్రావణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!