Social 1080×1350 • Multi-page
05-10-2024 BREAKING NEWS 05:54 AM
swarnodayam.com
Telugu Daily News

యువత కోసం స్వచ్ఛందంగా కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి. -అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

యువత కోసం స్వచ్ఛందంగా కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి. -అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
IMG_20241005_165258

–చొప్పదండిలో పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల లో విస్తృతంగా పర్యటించారు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: చదువుకున్న ప్రతి- ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, యువతకు పోటీ పరీక్షలకు హాజరయ్యేలా ఉచిత కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చొప్పదండి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో, అధ్యాపకులతో పట్టభద్రులతో సమావేశం నిర్వహించి ఓటు నమోదుపై అవగాహన కల్పించి, రానన్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. తన సొంత ఖర్చులతో ఎమ్మెల్సీ పరిధిలోని ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానన్నారు. అంతకు ముందు చొప్పదండిలోని పలు భవానిమాత ఆలయాలు సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువత నరేందర్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!