06-10-2024 NORMAL NEWS 03:10 AM
swarnodayam.com
Telugu Daily News
06-10-2024 03:10 AM By Mandala Yadagiri

బూజునూరు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

బూజునూరు చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
IMG_20241006_140832

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట మండలం బుజునూర్ గ్రామ చెరువులో ఆదివారం సుమారు 35- 45 సంవత్సరాల మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి శవం లభ్యమైనట్లు ఇల్లందకుంట ఎస్సై ఎం రాజ్ కుమార్ తెలిపారు. ఈ శవం శరీరం చామనచాయ రంగులో ఉన్నదని, కుడి చేతికి స్టీల్ కడెం కలదని, శవంపై దుస్తులు blue colour టీ షర్టు, నేవీ బ్లూ colour lower(ప్యాంటు- fashion) కలదన్నారు.
ఈ మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెల్సినచో ఇల్లందకుంట ఎస్సై సెల్ : 8712670778 కి సమచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!