Social 1080×1350 • Multi-page
06-10-2024 BREAKING NEWS 07:16 AM
swarnodayam.com
Telugu Daily News

అలరించిన ఉషోదయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అలరించిన ఉషోదయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
IMG-20241006-WA0147

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చిన్న నాటి చిలిపి పనులు, క్లాస్ మేట్స్ మధ్య జరిగిన సంభాషణలు, టీచర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నాటి పదవ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఎంతో అపురూపంగా జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో 2003-04 వ పదవతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా నాటి విద్యార్థులు తమ చిన్న నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనంద పరవశులయ్యారు. ఉపాధ్యాయులు తమకు చెప్పిన విద్యా బుద్దులను నెమరువేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు వారి అనుభవాలను పంచుకున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో వివరించారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉషోదయ స్కూల్ ఫౌండర్ మండల వీరాస్వామి, నాటి ఉపాధ్యాయులు సరళ, గునిగంటి శ్రీనివాస్, చిలుకమారి సత్యరాజ్, గుణిగంటి మహేందర్, మండల వెంకట్, బూసారపు తిరుపతి, స్వర్ణలత, రేణుక, గోపాల్, వెంగల్ రావు, మొగిలి లతో పాటు నాటి విద్యార్థులు గరిగే శివ, బి శ్రీనివాస్, జీ రాజు, జీ సుమన్ కుమార్, వై శ్రీనివాస్ రెడ్డీ, వినోద్, కార్తీక, వనిత, రవళి తదితరులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!