Social 1080×1350 • Multi-page
06-10-2024 BREAKING NEWS 12:42 PM
swarnodayam.com
Telugu Daily News

మాస్టర్ ట్రైనింగ్ క్యాంప్ లో కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ప్రతిభ

మాస్టర్ ట్రైనింగ్ క్యాంప్ లో కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ప్రతిభ
IMG_20241006_234012

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాద్ లోని మణికొండ పరిధిలో గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా అసోసియేషన్ వ్యవస్థాపకులు హన్షి పొన్నం వెంకటేశం ఆధ్వర్యంలో ఆదివారం మాస్టర్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని ఉర్దూ భవన్ ఏరియాకు చెందిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నారు. వెపన్స్, సీనియర్ బ్లాక్ బెల్ట్ కటాస్ వివిధ భాగంలో ప్రతిభ కనబరచడంతో కరాటే మాస్టర్ ఎస్ కే జలీల్ ను వారు ఆభినందించి హుజురాబాద్ కు మంచి పేరు కరాటేలో తీసుకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు పెన్షనర్ జిల్లా కరీంనగర్ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మైనార్టీ నాయకులు మహమ్మద్ సలీం, మాజీ ఏఎంసి డైరెక్టర్ మొహమ్మద్ ఖాలీ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు, న్యూ కాకతీయ ప్రిన్సిపాల్. బి రాజ్ కుమార్, డైరెక్టర్ ఎం గోపాల్ రావు, వెంగల్ రావు, వెంకన్న తదితర నాయకులు కరాటే మాస్టర్ ఎస్.కె జలీల్ ను అభినందించిన వారిలో ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!