Social 1080×1350 • Multi-page
07-10-2024 BREAKING NEWS 07:12 AM
swarnodayam.com
Telugu Daily News

అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యం పట్టివేత
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లిక్రాస్ రోడ్ వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న 10.5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను పోలీసుల తనిఖీల్లో పట్టుకున్నట్లు హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యం విలువ రూ.18,900 ఉంటుందని, రేషన్ బియ్యంతో పాటు వాటి తరలింపుకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి బియ్యం తరలిస్తున్న శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన అంగిడి సుధాకర్, హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటకు చెందిన రేవల్లి తిరుపతి, చేల్పూరు గ్రామానికి చెందిన మణెమ్మ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!