Social 1080×1350 • Multi-page
07-10-2024 BREAKING NEWS 09:10 AM
swarnodayam.com
Telugu Daily News

బొలెరో ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

బొలెరో ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
IMG_20241007_200748

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని వరంగల్ రోడ్డు పరకాల క్రాస్ వద్ద ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన జూపాక రమేష్( 28) సంవత్సరాలు తన ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ కు వచ్చి తిరిగి స్వగ్రామం వీర నారాయణపూర్ కు వెళ్తుండగా పరకాల క్రాస్ రోడ్ వద్ద బోలేరో వాహనం అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రమేష్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే 108 వాహనంకు సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది హుజురాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. బ్లూ కోల్ట్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!