Social 1080×1350 • Multi-page
07-10-2024 BREAKING NEWS 10:37 AM
swarnodayam.com
Telugu Daily News

దళిత బంధు రెండవ విడత నిధుల విడుదల కోసం బాధితుల ధర్నా.

దళిత బంధు రెండవ విడత నిధుల విడుదల కోసం బాధితుల ధర్నా.
1000773489

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం హుజురాబాద్ పట్టణంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఉమ్మడి రీజియన్ ఇంచార్జ్ చిలువేరు శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద దళితులకు గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు అందించిందని అన్నారు. కొంతమందికి రెండో విడత నిధులు ప్రభుత్వం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండో విడత నిధులు మంజూరు చేయకుండా ఆపుతుందని ఆరోపించారు. దళితుల ప్రయోజనాల కోసం వెంటనే వారికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువులు దళిత బంధు బాధితులు, ధర్మ సమాజ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!