Social 1080×1350 • Multi-page
07-10-2024 BREAKING NEWS 11:42 AM
swarnodayam.com
Telugu Daily News

నాన్న కారు కొనీయడం లేదని కొడుకు ఆత్మహత్య

నాన్న కారు కొనీయడం లేదని కొడుకు ఆత్మహత్య
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తండ్రి కారు కొనిస్తలేడని ఓ కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన శనిగరపు భద్రయ్య కుమారుడు మహేందర్ (23 ) సంవత్సరాల యువకుడు తండ్రి కారు కొనిస్తలేడని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి అపస్మానిక స్థితికి వెళ్లగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తండ్రి కారు కొనిస్తలేడని కొడుకు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలోనే గాక మండలం, జిల్లాలో తీవ్ర చర్చనియాంశంగా మారింది. చిన్నప్పటినుండే తమ సంతానాన్ని క్రమశిక్షణ, కట్టుబాట్లు, డబ్బు విలువ, సమాజంలో నడవడిక గురించి, నైతిక విలువలు తెలిసేలా పిల్లలని పెంచితే నేడు ఆ కన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలేది కాదు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!