Social 1080×1350 • Multi-page
09-10-2024 BREAKING NEWS 03:51 AM
swarnodayam.com
Telugu Daily News

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
IMG_20241009_144739

– ఆడి-పాడిన మహిళా కాంగ్రెస్ నేతలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలకు గాజులు, పండ్లు, పూలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల వాయినంగా అందజేశారు. తీరొక్క పూలతో ప్రకృతిని దైవంగా భావించి ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మను ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పూల జాతరకు కాంగ్రెస్ మహిళలు పెద్దఎత్తున వచ్చి పాల్గొని ఆడి, పాడారు. ఆద్యంతం వైభవంగా జరిగిన ఈ బతుకమ్మ సంబరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సంబరాలు మహిళల కొలాటాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి శివ-రేణుక, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, ఇల్లంతకుంట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొడం రజిత, మహిళా విభాగం నాయకురాల్లు కడారి తిరుమల, మల్లీశ్వరి, మంద మంజుల, పుల్ల రాధ, చిదిరాల సునిత, సొల్లు సునిత, యండి కరీమా, తోటస్వప్న, రజిత స్వరూప, రిబ్కా, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొల్లు బాబు, సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, ఉప్పు శ్రీనివాస్ పటేల్, తాళ్ళపెల్లి రమేష్, ఎర్ర రవీందర్, గంట కిరణ్ రెడ్డి, యండి షాధిక్, యండి రియాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!