Social 1080×1350 • Multi-page
14-10-2024 BREAKING NEWS 04:01 AM
swarnodayam.com
Telugu Daily News

మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్ కొనగాల మహేష్.

మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్ కొనగాల మహేష్.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్ (గన్నేరువరం): మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్ కొనగాల మహేష్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ హాజరై ప్రసంగించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం మున్నూరుకాపుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, బడ్జెట్‌ లో కోట్ల రూపాయల నిధులు కేటాయింపు చేశామని తెలిపారు. కార్పొరేషన్ కు మరిన్ని నిధులు తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులను అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతుగా ప్రయత్నిస్తానని మహేష్ తెలిపారు. తను పుట్టి పెరిగిన ఈ ప్రాంతం బిడ్డగా మండలంలో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

మున్నూరు కాపుల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం స్థానిక శాసనసభ్యుల సహకారం మరియు సుడా చైర్మన్ సహకారం తీసుకుంటామని మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పురంశెట్టి బాలయ్య నియామకానికి కృషి చేసినందుకు, డా. కొనగాల మహేష్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల సోదరులంతా ఐక్యమత్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యదర్శి పురంశెట్టి బాలయ్య, మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు బాలయ్యలను మహేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ గంప వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రవి, కొట్టే భూమయ్య, జంగిటి ప్రకాష్ నగేష్, కొట్టె నర్సయ్య, పుల్లెల రాము, మార్గం కనుకయ్య, కొల్పుల రవి, తోట శ్రీను, మైసంపెల్లి మల్లేశం, వరాల సత్తయ్య, తోట కనుకయ్య, తోట రాజేశం, పురంశెట్టి రమేష్, గంప మహేష్ వివిధ గ్రామాల కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!