14-10-2024 NORMAL NEWS 07:22 AM
swarnodayam.com
Telugu Daily News
14-10-2024 07:22 AM By Mandala Yadagiri

పూలే విగ్రహాన్ని ధ్వసం చేయడంపై హుజురాబాద్ లో ప్రజా సంఘాల నిరసన.

పూలే విగ్రహాన్ని ధ్వసం చేయడంపై హుజురాబాద్ లో ప్రజా సంఘాల నిరసన.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వరంగల్ జిల్లా దేశాయిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వసం చేయడంపై నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ సందెల వెంకన్న ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వసం చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను కూల్చడం,ధ్వసం చేయడం వల్ల మహాత్ముల చరిత్రను చెరిపి వేయలేరని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల చైతన్యం కోసం ఎంతో పాటు పడ్డారని అన్నారు. మహాత్ముల విగ్రహాలను కూల్చి వేస్తున్న, ధ్వసం చేస్తున్న సంఘవిద్రోహ శక్తులపై కఠినమైన చట్టాలను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, పసుల స్వామి, మాడుగుల ఓదెలు, ములుగు రవి, ఏనూరి అశోక్, తాళ్లపల్లి అమరేందర్, కోడూరి సమ్మయ్య, చల్లూరి రాజు, సిరికొండ సమ్మయ్య, గిరవేణి శ్రీకాంత్, మిడిదొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!