Social 1080×1350 • Multi-page
14-10-2024 BREAKING NEWS 07:59 AM
swarnodayam.com
Telugu Daily News

స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయండి..-కలెక్టర్ పమేలా సత్పతి

స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయండి..-కలెక్టర్ పమేలా సత్పతి
1000835480

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్మార్ట్ సిటీలో భాగంగా జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపట్టిన జంక్షన్ నిర్మాణ పనులను, అంబేద్కర్ స్టేడియంలో నిర్మించిన కాంప్లెక్స్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమే మాట్లాడారు. స్మార్ట్ సిటీ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి చేయించాలన్నారు. నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలి అని ఆదేశించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్, నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ట్రైనీ ఐఏఎస్ అజయ్ కుమార్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!