Social 1080×1350 • Multi-page
15-10-2024 BREAKING NEWS 01:59 AM
swarnodayam.com
Telugu Daily News

రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు..పథకం మార్చిన పరవాలేదు కేసీఆర్ కిట్, కంటి వెలుగు అమలు చేయండి.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు..పథకం మార్చిన పరవాలేదు కేసీఆర్ కిట్, కంటి వెలుగు అమలు చేయండి.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG_20241015_125551

–దున్నపోతుపై వర్షం పడినట్టు ప్రభుత్వ పరిస్థితి ఉంది

–ముఖ్యమంత్రికి కోపం ఉంటే మా మీదే చూపించాలి ప్రజల మీద కాదు

–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం నిత్యం వందలమంది ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖి చేసిన అనంతరం డాక్టర్లు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణీల పట్ల సోమవారం డాక్టర్లు డెలివరీ నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఆరోగ్యం కోసమే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఉంటుందని, ఒక్క రోగి కూడా ఆస్పత్రిలో ఇబ్బంది పడకూడదని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పూర్తిస్థాయిలో అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో చికిత్స అందడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందన్నారు. కెసిఆర్ హయాంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు 200లకు పైగా డెలివరీలు జరిగేవని ప్రస్తుతం ఆస్థాయి గణనీయంగా పడిపోయిందన్నారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రి పై ఒత్తిడి తీసుకురావడంతో డెలివరీల సంఖ్య వందకు పెరిగాయని భవిష్యత్తులో వీటిని 200 పెంచాలని డాక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం ఉంటే కెసిఆర్, బీఆర్ఎస్ నాయకుల మీద తీర్చుకోవాలి తప్పా పేద ప్రజల పైన కాదన్నారు. హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతగా ఉందని వెంటనే పూర్తిస్థాయిలో సిబ్బందిని నింపాలన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక గైనకాలజిస్ట్ తో పాటు అనస్తిష్టును వెంటనే కేటాయించాలని, అలాగే జమ్మికుంట కూడా గైనకాలజిస్ట్ ను నియమించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ తో పాటు డెలివరీ అయిన తర్వాత కెసిఆర్ కిట్ ని కూడా అందించాలన్నారు. కెసిఆర్ కిట్ కి పేరును మార్చిన పరవాలేదని, గర్భిణీ స్త్రీలకు గతంలో మాదిరిగానే ఆడపిల్ల పుడితే రూ.13000 మగ బిడ్డ పుడితే రూ. 12000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా తిరిగి చేపట్టాలన్నారు. డాక్టర్లపై తమకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే వెంట అడిషనల్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చందూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంఓ సుధాకర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు మరపల్లి సుశీల, తొగరు సదానందం, ఉమామహేశ్వర్, వెన్నంపల్లి కిషన్, తాళ్లపల్లి శ్రీనివాస్, మక్కపల్లి కుమార్, ములుగు సృజన పూర్ణచందర్, బోరగాల శివకుమార్, నాయకులు ఇమ్రాన్, భాషబోయిన కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!