Social 1080×1350 • Multi-page
15-10-2024 BREAKING NEWS 07:33 AM
swarnodayam.com
Telugu Daily News

‘భవిష్యత్తుకు వారధులు’ విద్యార్థులే! – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

‘భవిష్యత్తుకు వారధులు’ విద్యార్థులే! – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
IMG-20241015-WA0311

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగడానికి పరిశుభ్రంగా ఉండాలని, చేతుల శుభ్రత వల్ల చాలా వ్యాధులను అరికట్టవచ్చని, అందుకే అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించి, ఆరోగ్యంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సూచించారు హుజురాబాద్ మండలం చేల్పూర్ ZPHS లో UNICEF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Global Handwashing Day కార్యక్రమంలో Collector ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తనకు ప్రభుత్వం అందజేసిన యూనిఫాం, షూస్ ధరించి, సమయానికి పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.
“PM SHRI” క్రింద ఎంపికైన ఈ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని దానికి తోడు మంచి నాణ్యమైన విద్య క్రమశిక్షణ మనోధైర్యాన్ని ఇస్తూ, కార్పోరేట్ స్కూల్ పిల్లలకు దీటుగా ఎదగడానికి అవకాశం ఉందని ఉద్ఘటించారు. విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని అందుకే మంచి విద్య క్రమశిక్షణ అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో RDO రమేష్,UNICEF రాష్ట్ర ప్రతినిధులు కాశీనాథ్, ఫణీంద్ర, MRO కనకయ్య, MPDO సునీత, HM అనురాధ, UNICEF జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, MPO సతీష్ ,SBM రమేష్, వేణు, APM తిరుపతి, PS నాగరాజు, CFలు కళ్యాణి, రవీందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!