Social 1080×1350 • Multi-page
15-10-2024 BREAKING NEWS 08:36 AM
swarnodayam.com
Telugu Daily News

వీణవంక ట్రాన్స్ కో ఏఈ త్రిమూర్తి, ఉద్యోగుల బదిలీ.. -బదిలీ ఉద్యోగులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ సిబ్బంది.

వీణవంక ట్రాన్స్ కో ఏఈ త్రిమూర్తి, ఉద్యోగుల బదిలీ.. -బదిలీ ఉద్యోగులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ సిబ్బంది.
Oplus_0

స్వర్ణోదయం ప్రతినిధి, వీణవంక అక్టోబర్ 15: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల బదిలీలో భాగంగా మంగళవారం వీణవంక మండలంలోని వీణవంక సెక్షన్, చల్లూర్ సెక్షన్ కలిపి 13 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. వీణవంక సెక్షన్ లో ఎఈ ఎస్ త్రిమూర్తి కరీంనగర్ టౌన్ -9, సబ్ ఇంజనీర్ ఆర్ రాజు కరీంనగర్ టౌన్- 3, వి కొమురయ్య లైన్స్పెక్టర్ తనుగుల, డి రవీందర్ లైన్మెన్ ఇల్లందకుంట, పి శ్రీనివాస్ లైన్మెన్ ఇల్లందకుంట ( సిరిసిడు ) మద్దూరి శ్రీనివాస్ ఏఎల్ఎం జమ్మికుంట టౌన్, మొగిలి పాక శ్రీనివాస్ ఏఎల్ఎం ఇల్లంతకుంట ( భోగంపాడు ), వి సుగుణాకర్ ఏఎల్ఎం (చల్లూర్ ), ఎస్ ఐలయ్య ఏఎల్ఎం తాడికల్, డి గుణాకర్ ఏఎల్ఎం జమ్మికుంట టౌన్, జి రాజయ్య ఏఎల్ ఎం జమ్మికుంట టౌన్ కు బదిలీ అయ్యారు. అలాగే చల్లూర్ సెక్షన్ పరిధిలో ఏఈ సత్యనారాయణరెడ్డి కరీంనగర్ టౌన్ -7, కనుకయ్య ఏఎల్ఎం తాడికల్ సెక్షన్ కు బదిలీ కాగా, వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ ఆధ్వర్యంలో ఏఈ త్రిమూర్తి, సబ్ ఇంజనీర్ రాజు ను కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వీణవంక ట్రాన్స్ కో ఏఈ గా సేవలందించిన త్రిమూర్తికి, సబ్ ఇంజనీర్ రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, పైడి కుమార్, మసాడి చొక్కారావు, నల్ల కొండల్ రెడ్డి, కంకణాల జగన్ రెడ్డి, విద్యుత్ ఉద్యోగులు రహీం, పాషా, వేణు, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!