Social 1080×1350 • Multi-page
15-10-2024 BREAKING NEWS 10:17 AM
swarnodayam.com
Telugu Daily News

మాజీ సర్పంచ్ పుల్లాచారికి, పలువురి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ

మాజీ సర్పంచ్ పుల్లాచారికి, పలువురి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న పోతిరెడ్డిపేట మాజీ సర్పంచ్, బిఆర్ ఎస్ నాయకుడు తాటికొండ పుల్లాచారిని మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తొగరు సదానందం, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి ఇమ్రాన్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.
-రవీందర్ రావ్ కుటుంబానికి పరామర్శ
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన డిష్ ఆపరేటర్ నడిపెల్లి రవీందర్ రావు కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మండలంలోని సిర్సపల్లి గ్రామంలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!