16-10-2024 NORMAL NEWS 05:20 AM
swarnodayam.com
Telugu Daily News
16-10-2024 05:20 AM By Mandala Yadagiri

బీఆర్ఎస్ కార్యకర్త మద్దెల రవి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. -ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ కార్యకర్త మద్దెల రవి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. -ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
IMG-20241016-WA0035

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీణవంక మండలం ఎలుబాక గ్రామములో నేడు మా కార్యకర్త మద్దెల రవి చనిపోవడం దుఃఖానికి గురి చేసిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి రవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవి మృతి కుటుంబానికి తీరని నష్టం అని, రవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“ఈ కష్ట సమయంలో మేము మీతో ఉన్నాము,” అని ఆయన పేర్కొన్నారు. రవి BRS పార్టీ సభ్యుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని, ఆయన దురదృష్టకరంగా మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మ శాంతి పొందాలని ఆశిస్తున్నామని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!