Social 1080×1350 • Multi-page
16-10-2024 BREAKING NEWS 09:26 AM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలకు సర్కారు కసరత్తు! -లస్మక్కపల్లి గ్రామ యువనేత ప్రశాంత్ సొంత మేనిఫెస్టో రిలీజ్.. పలువురిని ఆలోచింపజేస్తున్న యువ నాయకుడు

రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలకు సర్కారు కసరత్తు! -లస్మక్కపల్లి గ్రామ యువనేత ప్రశాంత్ సొంత మేనిఫెస్టో రిలీజ్.. పలువురిని ఆలోచింపజేస్తున్న యువ నాయకుడు
IMG_20241016_202313

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నన్ను గెలిపించండి..పది తరాలు గుర్తుండిపోయేలా అభివృద్ధి చేస్తా అంటూ ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకమునుపే బరిలో సర్పంచ్ అభ్యర్థిగా మద్దుల ప్రశాంత్ వినూత్నంగా ప్రచారం చేయడం పలువురిని ఆకర్షిస్తుంది. ఆశావహులు ఎలక్షన్స్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కానీ, త్వరలో విడుదల చేయబోతున్నదనే అంచనాతో ఆశావహులు ముందే బరిలో నిలిచి గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. పవర్‌లోకి వస్తే తామేం చేస్తామో ముందే చెప్పేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన యువనేత ప్రశాంత్ పటేల్ మద్దుల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను ఒకసారి ఆశీర్వదిస్తే..పది తరాలు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఆడపిల్ల పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆడబిడ్డ పెండ్లికి కానుకగా రూ.2,016, గ్రామ ప్రజలందరికీ ఉచిత తాగునీరు, నిరుద్యోగ ఆడపడుచులకు టైలరింగ్ లో శిక్షణ ఇప్పించుట, గ్రామంలో డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, వీధిలైట్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి నెలా హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఏటా వినాయక మండపాల్లో అన్నప్రసాదం సొంత ఖర్చుతో ఏర్పాటు, మహిళా సంఘాల భవనాల ఏర్పాటుకు కృషి, అర్హులైన వారికి పింఛన్ వచ్చేలా కృషి, మూతపడిన స్కూల్ రీ ఓపెనింగ్, గ్రామస్తులెవరైనా చనిపోతే అంతిమ సంస్కారాల కోసం రూ.2 వేల ఆర్థిక సాయం వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రశాంత్ పటేల్ విడుదల చేశారు. లస్మక్కపల్లి గ్రామంలో ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలను ప్రశాంత్ చేపట్టారు. గ్రామానికి వచ్చే దారిలో అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపుతో పాటు రోడ్డు మార్గంలో సొంత నిధులతో మొరం పోయించడం, సీజనల్ డిసీజెస్ నేపథ్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు వంటివి చేసిన మద్దుల ప్రశాంత్ పటేల్.. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే, కనీసంగా నోటిఫికేషన్ రాకముందే యువనేత ప్రశాంత్ పటేల్ సొంత మేనిఫెస్టో విడుదల చేయడం గ్రామంతో పాటు మండల, నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు సంసిద్ధమవుతున్న క్రమంలో అందరికంటే ముందు వరుసలో నిలిచేందుకు యువలీడర్ ప్రశాంత్ ఇలా చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!