Social 1080×1350 • Multi-page
16-10-2024 BREAKING NEWS 10:56 AM
swarnodayam.com
Telugu Daily News

చింతకుంట డబుల్ బెడ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

చింతకుంట డబుల్ బెడ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్
IMG_20241016_215315

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్, అక్టోబర్ 16: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకుని రావాలని మున్సిపల్ డైరెక్టర్ గౌతమ్ అన్నారు.
బుధవారం అయన కలెక్టర తో కలిసి చింత కుంట పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి వివరాలను అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని, పనుల వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని అన్నారు. పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. లబ్దిదారులకు అపార్ట్మెంటులలో ఉండేందుకు అవసరమైన నీటి వసతి, డ్రైనేజీ, ఆట స్థలం వంటి మౌళిక సదుపాయాలు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!