Social 1080×1350 • Multi-page
17-10-2024 BREAKING NEWS 09:24 AM
swarnodayam.com
Telugu Daily News

రేకుర్తి బస్తి దావఖాన ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆరోగ్య మహిళ ‘పై అవగాహన కల్పించాలి

రేకుర్తి బస్తి దావఖాన ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆరోగ్య మహిళ ‘పై అవగాహన కల్పించాలి
IMG-20241017-WA0105

మండల యాదగిరి, స్వర్దయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 17:
ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం రేకుర్తిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్, మందుల గది, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ సుజాతను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బస్తీ దవాఖానాలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, రోగనిర్ధారణ పరీక్షల గురించి మహిళలకు వివరించాలన్నారు. కుక్క,పాము కాటుకో సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించేలా బస్తీ దావఖానాలో టీవీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారి మౌల్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!