Social 1080×1350 • Multi-page
19-10-2024 BREAKING NEWS 05:01 AM
swarnodayam.com
Telugu Daily News

పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఉదారత.. మంచినీటి శుద్ధి చేసే యంత్రం అందజేత

పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఉదారత.. మంచినీటి శుద్ధి చేసే యంత్రం అందజేత
IMG_20241019_155929

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చదువుకున్న పాఠశాలకు మంచినీరు శుద్ధి చేసే యంత్రాన్ని పూర్వ విద్యార్థులు బహుకరించి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990- 91 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు తమ గుర్తుగా సుమారు పదివేల రూపాయల విలువచేసే మంచినీరు శుద్ధి చేసే యంత్రాన్ని, నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు పూర్వ విద్యార్థులైన రావుల వేణు, సంపంగి రాజేందర్ (మైఖేల్), మంచికట్ల కోటిలింగం, ముక్క నరసింగం, జూపాక నరసింగం తదితర మిత్రులు కలిసి బహుమానంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బండ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు తోకల శివారెడ్డి, శ్రీనివాస్, పొలంపల్లి ఆదర్షన్ రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, నాగరాజు, పృథ్వీరాజ్ సింగ్, సరోజ, రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుకరించిన పూర్వ విద్యార్థులకు పాఠశాల పక్షాన ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!