Social 1080×1350 • Multi-page
20-10-2024 BREAKING NEWS 12:15 PM
swarnodayam.com
Telugu Daily News

ఒకే రూట్ లో రెండు రకాల ఛార్జి వసూల్! చార్జీలలో తేడాతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆర్టీసీ.

ఒకే రూట్ లో రెండు రకాల ఛార్జి వసూల్!  చార్జీలలో తేడాతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆర్టీసీ.
IMG-20241020-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఒకే రూట్ లో రెండు రకాల ఛార్జిలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆర్టీసీ అధికారుల తీరుపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఎలా ఉన్నాయి. హుజురాబాద్ నుండి హన్మకొండకు రూ.50/- ఒక డిపో, మరొక డిపో రూ.60/- వసూల్ చేస్తున్నాయి. ఇదేమని ప్రయాణికులు అడిగితే ఇంకా టిన్ మెషిన్ లో మార్చలేదు అంటూ పలువురు ఉద్యోగులు తప్పించుకుంటున్నారు. గత ఏడాది నుంచి యూనివర్సిటీ క్రాస్ నుండి ములుగు బైపాస్ రోడ్డు గుండా సిటీ మొత్తం తిప్పుతూ హనుమకొండ బస్టాండ్ కు బస్సులు వెళ్లేటివి. ఆ విధంగా తిరగడం వల్ల కిలోమీటర్లు ఎక్కువ చూపి ₹10 అదనంగా వసూలు చేశారు. అయితే నయింనగర్ వద్ద బ్రిడ్జి కట్టి దాని గుండా బస్సులు నడుస్తుండగా సుమారు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం తగ్గినా కూడా అదే డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికుల ముక్కు పిండి వసూలు చేస్తూ ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతున్నారు. దాదాపు నెల రోజుల నుండి భయం నగర్ బ్రిడ్జి రెడీ అయ్యి వాహనాలు నడుస్తున్న పాత విధానంలోనే డబ్బులు వసూలు చేస్తూ ఒక్కో వ్యక్తికి పది రూపాయలు అదనముగా వసూలు చేస్తుండడం ఆర్టీసీ దోపిడీకి నిదర్శనం కాదా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై దృష్టి సారించి గత పెంచిన అదనపు చార్జీని తగ్గించి, యధావిధిగా 50 రూపాయల చార్జీలు తీసుకునేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!