Social 1080×1350 • Multi-page
21-10-2024 BREAKING NEWS 05:37 AM
swarnodayam.com
Telugu Daily News

మాదిగల ధర్మ యుద్ధ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.

మాదిగల ధర్మ యుద్ధ జిల్లా మహాసభను జయప్రదం చేయండి.
IMG-20241021-WA0111

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అప్పటివరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ అధ్యక్షతన హుజురాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ ఇంజం వెంకటస్వామిమాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను దేశంలోనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్సు తెచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించి ఆచరణలో మాట తప్పి వర్గీకరణ లేకుండానే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మిగతా ఉద్యోగాలను కూడా మాలల ఒత్తిడికి తలొగ్గి భర్తీ చేసే ప్రయత్నాము చేస్తున్నారన్నారు. దీనిని నిరసిస్తూ అక్టోబర్ 27న జగిత్యాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సదస్సు జరుగుతుందని కావున హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న మాదిగ విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ విభాగాల కార్యకర్తలు, ఉద్యోగులు, మహిళలు మరియు జాతి యావత్తు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయగలరని వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రంమాదిగ, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు రేణిగుంట్ల సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి దేవునూరి రవీందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు ఆంబాల మధునయ్య, హుజురాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు అధ్యక్షుడు రొంటాల రాజ్ కుమార్ మాదిగ, వీణవంక మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోరే అరుణ్ మాదిగ, మరియు సీనియర్ నాయకులు రుద్రారపు రవి తేజ మాదిగ, రామంచ రాకేష్ మాదిగ, కొడిపాక రక్షిత్ మాదిగ, అంబాల చెంతన్ మాదిగ, గాజుల కుమార్ మాదిగ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!