Social 1080×1350 • Multi-page
21-10-2024 BREAKING NEWS 12:36 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అధికారుల విచారణ! మృత శిశువు లభ్యంపై వైద్యుల, సిబ్బందిపై అధికారుల ఆగ్రహం..!?

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అధికారుల విచారణ! మృత శిశువు లభ్యంపై వైద్యుల, సిబ్బందిపై అధికారుల ఆగ్రహం..!?
IMG-20241021-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి అత్యవసర గది పక్కన ఉండే బాత్రూంలో ఆడ శిశువు మృతదేహం లభ్యమైన విషయమై సోమవారం ప్రత్యేక విచారణ అధికారి ఆర్టీవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అధికారుల బృందమ ఏరియా ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమర్జెన్సీ వార్డులోని బాత్రూంలో ఆరు నెలల ఆడ శిశువు మృతి చెంది లభ్యమైన విషయం తెలిసిందే. ఈ మేరకు విధుల్లో ఉన్న వైద్యుడు డాక్టర్ రమేష్, సిబ్బందిని విచారించారు. ఒక్కొక్కరిగా ఆ రోజు జరిగిన సంఘటన పై విచారణ జరిపి వివరణ తీసుకున్నారు.

ఆస్పత్రిలో కెమెరాలు ఉండి నిరంతరం సిబ్బంది పర్యవేక్షిస్తుండగా ఏం జరుగుతుందో తెలియకుండా అజాగ్రత్తగా ఉండడంపై విచారణాధికారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విచారణలో ఆర్డీవో రమేష్ బాబు, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, డిసిహెచ్ చంద్రశేఖర్, హుజురాబాద్, జమ్మికుంట, తాహశీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!