Social 1080×1350 • Multi-page
22-10-2024 BREAKING NEWS 03:13 AM
swarnodayam.com
Telugu Daily News

యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టిఐ (U/F)హుజురాబాద్ టౌన్ కమిటీ కన్వీనర్ గా ఇప్పలపల్లి చంద్రశేఖర్

యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టిఐ (U/F)హుజురాబాద్ టౌన్ కమిటీ కన్వీనర్ గా ఇప్పలపల్లి చంద్రశేఖర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టిఐ (U/F)హుజురాబాద్ టౌన్ కమిటీ కన్వీనర్ గా పట్టణానికి చెందిన ఇప్పలపల్లి చంద్రశేఖర్ ను నియమించినట్లు ఫోరం ఫర్ ఆర్ టిఐ (U/F) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామిరెడ్డి తెలిపారు. ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెన్ తెలంగాణ ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ మరియు మండల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్ టిఐ (U/F) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. హుజురాబాద్ టౌన్ కమిటీ కన్వీనర్ గా ఇప్పలపల్లి చంద్రశేఖర్, కో కన్వీనర్ గా పసుల స్వామి, టౌన్ సలహాదారునుగా కాగిత రాములు, మండల కమిటీ కన్వీనర్ గా బెల్లి సతీష్, కో కన్వీనర్ గా మొలుగురి మొగిలయ్య, మండల కమిటీ సలహాదారులుగా బండ లక్ష్మారెడ్డి, నియోజకవర్గం కో కన్వీనర్ గా కేదాసి శ్రీధర్ మరియు నియోజకవర్గ కో కన్వీనర్ గా పోలెపాక విల్సన్, సలహాదారులుగా కంకణాల జనార్దన్ రెడ్డిలకు నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తులసి లక్ష్మణమూర్తి, సంధ్యాల వెంకన్న, గూడూరు చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!